
భవిష్యత్‌పై బాధ్యతతో తీసుకున్న నిర్ణయం
పాలకుర్తి టౌన్: మా జీవితం చిన్నదే కానీ, లక్ష్యం స్పష్టంగా ఉంది. మా కుమార్తెకు ఉత్తమ చదువు, ఆరోగ్యం, స్వేచ్ఛతో కూడిన భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కూతురు చాలనుకున్నాం. పెరుగుతున్న ఖర్చులు, స్కూల్ ఫీజులు, హెల్త్ చెకప్స్ అన్నీ చూస్తుంటే, నాణ్యతతో జీవితం ఇవ్వడం ఒక్కరితోనే సాధ్యమవుతుంది. ఒక బిడ్డ అయితే మరింత ప్రేమ, మరింత శ్రద్ధ చూపే అవకాశం దొరుకుతుంది. భవిష్యత్‌లో పిల్లలకు అవకాశాలు తగ్గకుండా ఉండాలంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం అందుకు అనుగుణంగా ఉండాలి.
– దేవగిరి రేణుక– నాగరాజు, పాలకుర్తి, అర్చకుడు