
భక్తిశ్రద్ధలతో బీరప్ప బోనాలు
అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించిన కురుమ కులస్తులు
సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025
బచ్చన్నపేట: సిద్ధేశ్వరాలయంలో
లక్ష పుష్పాలంకరణలో శివలింగం
పాలకుర్తి టౌన్: లక్ష్మీనర్సింహస్వామికి
పూజలు చేస్తున్న అర్చకులు
జనగామ: తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పట్టణంలో ఆదివారం కురుమ కులస్తులు బీరప్ప స్వామికి బోనాలు స మర్పించారు. వందలాది మంది మహిళలతో జనగామ పురవీ ధులు భక్తి పారవశ్యంతో పులకించాయి. కళాకారుల ఢోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టింది. కురుమ కుల సంఘ పెద్దలు అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.
జనగామలో బీరప్ప బోనాల పండుగ కనుల పండువగా జరిగింది. కుర్మవాడ, నాగులకుంట, ధర్మకంచ, సాయినగర్, జ్యోతినగర్, బీరప్ప ప్రాంతాల నుంచి వందలాది మంది మహిళలు బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్లతో ర్యాలీగా బొడ్రాయి వద్దకు చేరుకున్నారు. బొడ్రాయి వద్ద గుమ్మడి కాయలు, నిమ్మకాయలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి మహంకాళి దేవాలయం, గుడి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నేరుగా బీరప్ప ఆలయానికి చేరుకున్నారు. బీరప్ప దేవునికి నైవేద్యం సమర్పించారు.
మొక్కుల చెల్లింపులు
పట్టణంలోని బీరప్ప కామారతి, మహంకాళి అమ్మవార్లకు సంఘ పెద్దలు మొక్కులు చెల్లించారు. ఆలయంలో ప్రత్యేక పూజ లు చేసి, అమ్మవారికి బో నం నైవేద్యం సమర్పించా రు. బోనాల పండుగ నేపధ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. కాగా పెద్ద కురుమ మోటె లింగయ్య, పట్టణ అధ్యక్షుడు బాల్దె మల్లేశం ఇంటి నుంచి ర్యాలీగా స్వామి వారి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘ ప్రతినిధులు జూకంటి శ్రీశైలం, కేమిడి ఉపేందర్, కర్రె కృష్ణ, కడకంచి మధు, మంత్రి శ్రీశైలం, వైకుంఠం, శ్రీను, శ్రీనివాస్, ఉపేందర్, రాములు, చందు పాల్గొన్నారు.
సోమేశ్వరాలయంలో..
పాలకుర్తి టౌన్: తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో మామిడి తోరణాలతో తులసీ దళాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సుందరాచార్యులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్

భక్తిశ్రద్ధలతో బీరప్ప బోనాలు

భక్తిశ్రద్ధలతో బీరప్ప బోనాలు