
అత్యాధునిక బోధన!
సర్కారు
బడుల్లో
జనగామ: విద్యారంగంలో సరికొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్కారు బడులకు వచ్చే విద్యార్థులకు కార్పొరేట్‌కు దీటుగా బోధన చేసేలా దేశంలోని ప్రసిద్ధ సంస్థల భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ సాధనాలు, ఏఐ బోధన, పిల్లల భద్రత, స్నేహపూర్వక వాతావరణంలో విద్యాబోధన తదితర కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ మేరకు ‘తల్లిదండ్రుల భాగస్వామ్యం–డిజిటల్ తరగతులు’ అనే అంశంపై నేడు (మంగళవారం) సమగ్ర శిక్షలో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, గురుకులాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించేందుకు ఉత్తర్వులను జారీ చేసింది.
విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర
జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యంతో సమావేశం నిర్వహించబోతున్నారు. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్రపై ఇందులో చర్చించనున్నారు. సమావేశాలకు ఒక్కరోజు ముందుగానే హెచ్‌ఎంలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారిని ఆహ్వానించాలి. సమావేశానికి హాజరయ్యే క్రమంలో తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ తెచ్చుకోవాలి. వారి ఫోన్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. పిల్లలు నమోదు, హాజరు మెరుగుపర్చేందుకు తల్లిదండ్రుల మద్దతు తీసుకోవాలి. ప్రతీ మూడో శనివారం పీటీఎం నిర్వహించడం జరుగుతుందని ముందుగానే సమాచారం ఇవ్వాలి.
అవగాహన కల్పించాలి..
సర్కారు బడుల్లో అమలు చేస్తున్న డిజిటల్ తరగతుల వివరాలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. డిజిటల్ లెర్నింగ్, జేఈఈ, నీట్, చైల్డ్ సేఫ్టీ తదితర అంశాలపై పిల్లలను తీర్చిదిద్దడంలో 6 సంస్థలు విద్యాశాఖతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సంస్థల ద్వారా పిల్లలకు అవసరమైన నైపుణ్యాలను అందించడంలో పూర్తి సహకారం లభిస్తుంది. ఎన్జీవోల సహకారంతో చదవడం, అర్థం చేసుకోవడం (2 నుంచి 5 తరగతులు), విద్యార్థులు, ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ సపోర్టు (6 నుంచి 10 తరగతులు), ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, డిజిటల్ ఇనిషియేటివ్, కోడింగ్, సమస్య పరిష్కారం, హ్యాండ్స్ అండ్ లెర్నింగ్, (1 నుంచి 10 తరగతులు), పోటీ పరీక్షల ప్రిపరేషన్ (నీట్, జేఈఈ, సీఎల్‌ఏటీ /9 నుంచి 12 తరగతులు/ప్రత్యక్ష తరగతులు, పరీక్షలు), పిల్లల భద్రత, రక్షణ, కౌన్సెలింగ్ (6 నుంచి 12 తరగతులు), బడి బయట ఉన్న పిల్లల నమోదు, వయోజన అక్షరాస్యత, వృత్తిపరమైన శిక్షణ (ఓపెన్ స్కూల్ విద్య) ఇస్తున్నట్లు తల్లిదండ్రులకు స్పష్టం చేయాలి.
విద్యార్థుల దినచర్యను గమనించాలి
విద్యార్థి బడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే దినచర్యను ఎప్పటికప్పుడు గమనించాలి. పిల్లలు నేర్చుకోవడంలో సహాయ పడడానికి ‘ఇంటింట చదువుల పంట’ (ఐసీపీ) యాప్‌ను వారికి అందుబాటులో ఉంచాలి. పిల్లలు చదువకునే ప్రదేశంలో టీవీ, రేడియో శబ్ధాలు లేకుండా చూడాలి.
మోడల్: 8
ప్రాథమిక :
341
ప్రాథమికోన్నత: 64
కేజీబీవీ:
12
ఉన్నత: 103
స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో డిజిటల్ సాధనాలు
పిల్లల భవిష్యత్‌పై ప్రభుత్వం
ముందుచూపు
కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన
బడుల పర్యవేక్షణపై తల్లిదండ్రుల
భాగస్వామ్యం
నేడు పేరెంట్స్, ఉపాధ్యాయుల సమావేశం
పీటీఎంలో పాల్గొనాలి..
పీటీఎంలో విద్యార్థి తల్లిదండ్రులు హాజరు కావాలి. గ్రామ పెద్దలు కూడా వీటిలో భాగస్వామ్యం అయితే మంచిది. విద్యార్థుల ప్రతిభ సామర్థ్యాలతో పాటు ఏమైన లోపాలు ఉంటే సమావేశాల్లో చర్చించవచ్చు. తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండి విద్యార్థి సామర్థ్యాలు మరింత మెరుగుపడేందుకు దోహదపడతాయి.
– రావుల రామ్మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయుడు
సద్వినియోగం చేసుకోవాలి..
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో చేపట్టబోయే సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సర్కారు బడుల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కీలకం. ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన గురించి ప్రస్తావించాలి.
– భోజన్న, డీఈఓ

అత్యాధునిక బోధన!

అత్యాధునిక బోధన!

అత్యాధునిక బోధన!

అత్యాధునిక బోధన!