
లేబర్ కోడ్‌లు రద్దు చేయాల్సిందే..
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం లేబర్‌కోడ్‌లు రద్దు చేయాల్సిందేనని, లేదంటే కార్మికులు ఆగ్రహా నికి గురికాకతప్పదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న హెచ్చరించారు. బుధవారం కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఆర్‌టీయూ, ఐఎన్‌టీయూసీ, జా డు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రిస్టన్ గ్రౌండ్ నుంచి నెహ్రూపార్క్ వరకు ర్యాలీ చే పట్టారు అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వేము ల నర్సింగం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రాజారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్నలు మాట్లాడారు. బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, దే శంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కా ర్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది గంటల పనిని 10 గంటలకు పెంచే జీఓ 282ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సుంచు విజేందర్, భూక్య చందు నాయక్, జేరుపోతుల కుమార్, శ్రీదేవి, రాధ, యాకుబ్, కార్మికులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ