
పదోన్నతులకు వేళాయె
జనగామ: రాష్ట్రంలోని ఉన్నత, ప్రాథమికో న్నత పాఠశాలల్లో పని చేస్తున్న అర్హత కలిగి న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్‌ఏ) పదోన్నతి ప్రక్రియ పట్టా లెక్కింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను విద్యాశాఖ మొదలు పె ట్టగా, సర్కారు నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. సీనియర్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ హెచ్‌ఎంగా పదోన్నతి పొందిన తర్వాత మల్టీజోన్–2 పరిధిలో (14 జిల్లాలు) బదిలీ కావా ల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో సీని యార్టీ జాబితాను తయారు చేసిన తర్వా త, జిల్లాల వారీగా ఉన్న ఖాళీలను పరిగణలోకి తీ సుకుని పోస్టింగులను ఇస్తారు. మొదటి విడత మ ల్టీజోన్ పదోన్నతి, బదిలీల సమయంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి 2 నుంచి 400కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తు తం ఉన్న జీహెచ్‌ఎంలను బదిలీలు చేసిన తర్వాత, పదోన్నతులు చేపడితే ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల వాదన.
పదోన్నతికి 163 స్కూల్ అసిస్టెంట్లు..
జిల్లాలో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు 167 ఉన్నాయి. ఈ పాఠశాలల పరిధిలో గెజిటెడ్ హెచ్‌ఎంకు అర్హత కలిగిన 163 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ ఏ) ఉన్నారు. 2009లో పదోన్నతుల ప్రక్రియ జరుగగా, వరుసగా 2011, 2013, 2015లో క్రమం తప్పకుండా నిర్వహించారు. 9 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత అనేక పోరాటాల ఫలితంగా 2024 జూన్ 12వ తేదీన 2001 సీనియార్టీ ప్రకారం ఎస్‌ఏలకు మల్టీజోన్–2 గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించి, బదిలీ చేశారు. ఏడాది తర్వాత రెండోసారి పదోన్నతుల ప్రక్రియకు కదలిక వచ్చింది. కానీ ప్ర భుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం 2022 డిసెంబర్ 31వ తేదీ వరకు ఎస్‌ఏగా సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతికి అర్హతగా లెక్కించనున్నారు. పదోన్నతుల సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, జనరల్ కోటలో రిజర్వేషన్ల ఆధారంగా సీనియార్టీ జాబితాను తయారు చేస్తారు.
సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు
ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు
నేడు ప్రెస్టన్‌లో
సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జిల్లాలో 163 సీనియర్
స్కూల్ అసిస్టెంట్లు
నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జిల్లా కేంద్రం హనుమకొండరోడ్‌లోని ప్రెస్టన్ స్కూల్‌లో నేడు (గురువారం) స్కూల్ అసిస్టెంట్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగనుంది. జిల్లాలో ఉన్నత పాఠశాలలో 148, ప్రాథమికోన్నత స్థాయిలో 15 మంది గెజిటెడ్ హెచ్‌ఎంకు అర్హత కలిగి ఉన్నారు. జిల్లాల వారీగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే జాబితాను ఆర్‌జేడీకి పంపిస్తారు. మల్టీజోన్–2 పరిధిలో ఖాళీల ఆధారంగా సీనియార్టీ జాబితా ప్రకారం రెండు, మూడు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తారు. స్థానిక సంస్థల నగారా మొగనున్న నేపధ్యంలో ప్రభుత్వం తక్షణమే పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు బదిలీలను చేపట్టాల్సి ఉంటుంది. అంతకు ముందుగానే మల్టీజోన్–2 ఏరియాలో గెజిటెడ్ హెచ్‌ఎంల బదిలీలను నిర్వహించి, జిల్లాల వారీగా ఖాళీల్లో ప్రస్తుతం పదోన్నతులు పొందే వారికి అవకాశం కల్పిస్తే ఇబ్బందులు ఉండవని ఉపాధ్యాయ సంఘాల వాదన. ఎస్‌ఏలకు పదోన్నతులు కల్పించే క్రమంలో ఆ ఖాళీలను సీనియర్ ఎస్జీటీలతో భర్తీ చేయనున్నారు.

పదోన్నతులకు వేళాయె