
పసుపు అలంకరణలో రేణుకా ఎల్లమ్మ
జనగామ: ఆషాఢమాసం పర్వదినం పురస్కరించుకుని పట్టణంలోని బాలాజీనగర్ రేణుకా ఎల్లమ్మ తల్లి పసుపు (హిరణ్యం) అలంకరణలో బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. కాలనీవాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
నేడు శాకంబరీ ఉత్సవాలు
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేడు (గురువారం) శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. శ్రీచండిక అమ్మవారి దేవాలయంలో పార్వతీదేవి శాకంబరీ దేవిగా అలంకరిస్తారన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
పెన్షన్‌దారులను మోసం చేస్తున్న ప్రభుత్వం
జనగామ రూరల్: పెన్షన్‌దారులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఆగష్టు 13న నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ పెన్షన్‌దారుల గర్జనకు లక్షలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పైస రాజశేఖర్, తాళ్లపల్లి కుమార్, బిర్రు నగేష్, ఇనుముల నర్సయ్య, రవీందర్, శాంసన్ నిర్మలా భాస్కర్, గువ్వల రవి తదితరులు పాల్గొన్నారు.
దేవాలయాల పరిశీలన
పాలకుర్తి టౌన్: ధూప దీప నైవేద్యం పథకాన్ని అమలు చేయడానికి త్రిసభ్య కమిటీ సభ్యులు బుధవారం పాలకుర్తి మండలంలోని వల్మిడి, మంచుప్పుల, ఎల్లరాయిని తొర్రూరులోని ఆ లయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మీ మా ట్లాడుతూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమి షన్ ఆదేశాల మేరకు జిల్లాలో 45 దేవాలయాలు ధూప దీప నైవేద్యం పథకం కోసం దరఖా స్తు చేసుకున్నాయన్నారు. ఆయా ఆలయాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిస భ్య కమిటీ సభ్యులు దేవగిరి అనిల్‌కుమార్, త్రిపురారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా
బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ప్రొఫెసర్, డా క్టర్ రాజలింగం బుధవారం బాధ్యతలను స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయనను జనగామ డీహెచ్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ గోపాల్‌రెడ్డి సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మధుకర్, అనురాధ, వైద్య సిబ్బంది పాల్గొని నూతన సూపరింటెండెంట్‌ను శాలు వాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు.
ట్రెజరీ అధికారిగా అన్వర్ హుస్సేన్..
జనగామ రూరల్: జిల్లా ట్రెజరీ అధికారిగా ఎండీ అన్వర్ హుస్సేన్ బుధవారం బాధ్యతల స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

పసుపు అలంకరణలో రేణుకా ఎల్లమ్మ

పసుపు అలంకరణలో రేణుకా ఎల్లమ్మ

పసుపు అలంకరణలో రేణుకా ఎల్లమ్మ