
ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి..
మల్టీజోన్–2లో 280 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల్లో సీనియర్ టీచ ర్లు హెచ్‌ఎంలుగా అదనపు బాధ్యతలను స్వీకరించడంతో సబ్జెక్టుల కొరత ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది పదవీ విరమణ చేయడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా ఖాళీలను భర్తీ చేయడానికి పభుత్వం నిర్ణయించుకోవడం అభినందనీయం. అదే సందర్భంలో ఎంఈఓలను నియమిస్తే బాగుంటుంది. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, విద్యారంగంలో నాణ్యత పెరగడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం దిశగా ముందుకు వెళతాయి.
– పి.చంద్రశేఖర్‌రావు,
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు