
పారిశుద్ధ్య నిర్లక్ష్యంపై నిరసన
జనగామ: జిల్లా కేంద్రంలో పేరుకుపోతున్న పారిశుద్ధ్యంపై పాలకవర్గం లేకపోగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై ప్రతిపక్ష పార్టీలు వినూత్న నిరసన తెలిపారు. ఇటీవల ‘సాక్షి’లో జనగామ మున్సిపల్‌లో గాడితప్పిన శానిటేషన్ నిర్వహణ, అంతర్గత రోడ్లు గుంతలమయం, రహదారులపై పేరుకుపోతున్న చెత్తకు సంబంధించి వరుస కథనాలకు ఉన్నతాధికారులతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ‘సాక్షి’ కథనాలను చూపిస్తూ సోమవారం పట్టణంలో ‘క్లీన్ అండ్ గ్రీన్ జనగామ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పోకల జమున మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో పాలకవర్గం ఎన్నికలు నిర్వహించక పోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. వీధి దీపాలు వెలుగక, మురుగు నీరు రోడ్లపైకి చేరి కంపు కొడుతుందన్నారు. కమిషనర్ నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రావెల రవి, మొహినుద్దీన్, దేవుని సతీష్, మాజీ కౌన్సిలర్లు పేర్ని స్వరూప, వాంకుడోత్ వనిత, జూకంటి లక్ష్మీ శ్రీశైలం, బండ పద్మ, మాజీ కోఆప్షన్ సభ్యులు మసీ ఉర్ రెహమాన్, ధర్మపురి శ్రీనివాస్, సేవెల్లి మధు, కృష్ణ ఉల్లెంగుల సందీప్, ఉడుగుల నరసింహులు, తిప్పారపు విజయ్, యాకూబ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
వెలుగని వీధిదీపాలు,
దుర్వాసనతో ప్రజల అవస్థలు
మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం!
ఎమ్మెల్యే పల్లా ఆదేశాలతో బీఆర్‌ఎస్ ‘క్లీన్ అండ్ గ్రీన్ జనగామ’

పారిశుద్ధ్య నిర్లక్ష్యంపై నిరసన