
కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
● సంస్థాగత నిర్మాణంపై పార్టీ దృష్టి
● వీరి ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా కమిటీలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంపై కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవలి పర్యటన తర్వాత ఆ పార్టీ హైకమాండ్ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన అధిష్టానం.. సోమవారం ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్‌కు పార్టీ ఇన్‌చార్జ్‌గా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను నియమించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్‌కుమార్ గతంలో ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్మన్‌గా.. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖను కేటాయించారు. నల్లగొండ ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న లక్ష్మ ణ్‌కు ఉమ్మడి వరంగల్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్‌లో ఇటీవల నెలకొన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ సోమవారం లక్ష్మణ్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం మొదలవనుండగా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సంస్థాగత కమిటీలు పూర్తి చేసేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించిన అధిష్టానం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వీరి ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేసే బాధ్యతలను అప్పగించినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీబీ రహిత జిల్లాగా మార్చాలి
జనగామ రూరల్: టీబీ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్, ఎన్‌సీడీ ప్రోగ్రాం అమలు తీరును జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావుతో కలిసి పీహెచ్‌సీ, సబ్ సెంటర్స్, వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రులకు వచ్చే రోగులను పరిశీలిస్తూ అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎన్‌సీడీ వ్యక్తి పీహెచ్‌సీకి వస్తే వివరాలు అప్‌డేట్ చేసి, రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లోకార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందించాలన్నారు.
ఇందిరా మహిళా శక్తి పథకంతో ఉపాధి
ఇందిరా మహిళా శక్తి పథకంతో ఉపాధి కల్పన కలుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలతో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబురాలు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ హాజరై విజయోత్సవ సంబరాల ఆవశ్యకత నిర్వహణ గురించి దిశా నిర్దేశం చేశారు.

కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్