
శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు పాటుపడాలి
జనగామ రూరల్: శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు పాటుపడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఆదివారం శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప విద్యావేత్త, జాతీయవాది, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు ఒకే దేశం ఒకే జెండా అనే నినాదం చేసిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. రాజకీయానికి నూతన దశాదిశ నేర్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, ఓబీసీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల నారాయణ, భాగాల నవీన్ రెడ్డి, పెద్దోజు జగదీష్, శివ కృష్ణ, రఫ్తార్ సింగ్, చందు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్