
ముందస్తు చర్యలు తీసుకోవాలి
జనగామ రూరల్: పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పచ్చదనం విస్తృతంగా చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి దనసరి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలోని స్వచ్ఛదనం, పచ్చదనంపై చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, డీపీఓ స్వరూపారాణి, డీఆర్‌డీఓ వసంత, జెడ్పీ సీఈఓ మధురీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ శానిటేషన్ పనులు విస్తృతంగా చేపట్టాలని, పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు తొలగించాలని, మురుగు కాల్వలు శుభ్రపరచాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటూ అపరి శుభ్ర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను నిరంతరాయంగా చేపట్టాలన్నారు. ప్రతీ నెల 1, 11, 21 తేదీల్లో ట్యాంకులను శుభ్రం చేయించి, రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని, ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పచ్చదనం విస్తృతంగా చేపట్టాలి
వీసీలో మంత్రి దనసరి సీతక్క