
నిబంధనలు విస్మరిస్తే చర్యలు
దేవరుప్పుల: నిబంధనలు విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీసీపీ రాజమహేందర్‌నాయక్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల నమోదు రికార్డులు, జప్తు చేసిన సామగ్రి, కీలక భద్రత గదులను పరిశీలించారు. అనంతరం కామారెడ్డిగూడెంలోని వాగును పరిశీలించి ఇసుక ట్రాక్టర్ అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పేదల ఇళ్ల కోసం నిర్ధేశిత ప్రాంతాలకు రెవెన్యూ అధికారులు ఇస్తున్న అనుమతుల మేరకు ఇసుకను తరలించాలన్నారు. అక్రమంగా ఇతరులకు విక్రయిస్తే వాహనం సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ఇసుక రవాణా విషయంలో పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేయాలన్నారు. డీసీపీ వెంట ఎస్సై ఊర సృజన్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
డీసీపీ రాజమహేందర్‌నాయక్