
ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత తప్పనిసరి
● డీపీఓ స్వరూపారాణి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రతీ ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి అన్నారు. మండలంలోని తాటికొండ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఎదునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లోకాస్ట్ మ్యాజిక్ సోప్‌పిట్ (తక్కువ ఖర్చుతో నిర్మాణం చేసే ఇంకుడుగుంత)లను శుక్రవారం డీపీఓ పరిశీలించారు. గ్రామంలోని రైతువేదిక, పీహెచ్‌సీ, అంగన్‌వాడీ సెంటర్లలో నిర్మాణం చేపట్టిన ఇంకుడు గుంతలను ఆమె పరిశీలించారు. అనంతరం డీపీఓ మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలతో ప్రయోజనాలపై ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఇంకుడుగుంతల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, నీరు నిల్వ ఉండే చోట ఇంకుడు గుంతల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ నర్సింగరావు, కార్యదర్శి సత్యనారాయణ, ఏఈఓ శ్రావణి, అంగన్‌వాడీ టీచర్లు పద్మ, ధనలక్ష్మి, కారోబార్ సలీమ్, పోకల నరేష్ పాల్గొన్నారు.