
గ్రామ పాలనకు జీపీఓలు
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పాలన అధికారుల(జీపీఓ) నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఆదివారం(నేడు) జీపీఓల ఎంపికకు అర్హత పరీక్ష నిర్వహించడానికి అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీ జూని యర్ కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం జీపీఓ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో 200 వరకు దరఖాస్తులు రాగా పరిశీలన ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు కొన్నింటిని తిరస్కరించారు. గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చా రు. డిగ్రీ పూర్తిచేసిన, ఇంటర్‌తోపాటు ఐదేళ్ల సర్వీసు ఉన్న వారికి ఆమోదం లభించింది. జిల్లా నుంచి 97మంది వీఆర్వోలు, వీఆర్‌ఎలు, ఇతరులు పరీక్ష రాయనున్నారు.
రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ
జిల్లాలో 281 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించనున్నారు. గ్రామీణ భూసమస్యలపై అవగాహన ఉన్న పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలను జీపీఓలుగా ఎంపిక చేయనున్నారు. భూభారతి చట్టం అమలు బాధ్యతలు నిర్వహించడంలో వీరు కీలకం కానున్నారు.
సర్వీసుపై స్పష్టత కరువు
2022లో వీఆర్వో వ్యవస్థను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి వరకు పనిచేస్తున్నవారిని ఇత ర శాఖల్లో సర్దుబాటు చేసింది. చాలా మంది ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిని సొంత జిల్లాకు తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. గత డిసెంబర్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 26 వరకు మరోసారి దరఖా స్తులు ఆహ్వానించారు. డిగ్రీ, ఇంటర్ అర్హత ఉన్నవారికి స్క్రీనింగ్ పరీక్ష రాయాలని స్పష్టం చేశారు. అయితే, సర్వీసు విషయంలో స్పష్టత లేకపోవడంతో తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షకు ఏర్పాట్లు
గ్రామ పాలన అధికారుల నియామకంలో భాగంగా ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించడానికి అవసర మైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఆయన మూడు రోజుల క్రితం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించి పరీక్ష నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని.. పరీక్ష కేంద్రం, ఇతర వివరాల కోసం అధికారిక సీసీఎల్ వెబ్‌సైట్‌లో చూడొచ్చని పేర్కొ న్నారు. హాల్ టికెట్లు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మండలాల పరిధి అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేలా తహసీల్దార్‌లు సహకరించాలని, సమస్యలు ఉంటే నివృత్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించాలి
సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
నేటి గ్రామ పాలన అధికారి పరీక్ష నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీసీఎల్ ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి అదన పు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. గ్రామ పాలన అధికారి పరీక్షకు జిల్లాలో నోడల్ అధికారి ఆధ్వర్యాన అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచించారు. స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సుహాసిని, కలెక్టరెట్ ఏఓ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.
నియామక ప్రక్రియ షురూ
జిల్లా నుంచి 97 మందితో నివేదిక
నేడు రాత పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి
త్వరల్లో విధుల్లోకి చేరనున్న
గ్రామ పాలన అధికారులు