
చాలా ఏళ్ల నుంచి పాడుతున్నాం..
చాలా ఏళ్ల నుంచి మేం 12 మంది సభ్యులతో డప్పు కళాబృందం ఏర్పాటు చేసుకున్నాం. మనిషి చనిపోయిన సమయంలో వారు తన కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఏమనుకుంటున్నారనే మాటలతో అప్పటికప్పుడు పాటలు రాసుకుని పాడతాం. మా పాటలతో పెద్ద గొడవలు ఉన్న ఫ్యామిలీలు మారిన సందర్భాలూ ఉన్నాయి. మేం పాడే పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబీకుల ఆఖరి మజిలీలో పాటలు పాడాలని అడుగుతున్నారు.
– సౌరపు యాకాంబరం, దీక్షకుంట,
గ్రామ డప్పు కళాబృందం, నెక్కొండ మండలం