
ప్లాట్ల సమస్య పరిష్కరించండి
జిల్లా కేంద్రం హనుమకొండ రోడ్డులోని ఓ వెంచర్‌లోని ప్లాట్లను సుమారు 150 నుంచి 200 మంది కొనుగోలు చేసి రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన పలు కుటుంబాల్లో తగాదాల మూలంగా 2012లో వారు కోర్టుకు వెళ్లగా 2023లో ఆ కేసును కోర్టు కొట్టి వేసింది. అయినా హద్దు రాళ్లు తొలగించి తమను ఇబ్బంది పెడుతున్నారని కాలనీ అధ్యక్షుడు కె.నానాజీ, గొట్టం శ్రీధర్‌రెడ్డి, ఎల్ల స్వామి, నరసింహ, స్వప్న, లక్ష్మి, సోమశేఖర్, నోముల మహేందర్, బిక్షపతి, సునీత, హరికిషన్, పురుషోత్తం తెలిపారు. ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ అవకాశం కల్పించడంతో పాటు ఇంటి నిర్మాణ అనుమతులు ఇప్పించాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నారు.