
యుద్ధ ప్రాతిపదికన రిజర్వాయర్ల పనులు
పాలకుర్తి టౌన్: చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ధ్యేయని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం చెన్నూరు రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఆమె మాట్లాడుతూ చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని, పనులు పూర్తి చేస్తే సుమారు 77వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. భూసేకరణకు చర్యలు చేపట్టాల ని అధికారులను ఆదేశించారు. చెన్నూరు రిజర్వాయర్ తూము సమస్య పరిష్కరించి రైతులను ఆదుకుంటామని అన్నారు. మాజీ ఎంపీపీ కారుపోల శ్రీనివాస్‌గౌడ్, మదాసు హరీశ్, గుగులోతు యాకూబ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు
పేదల సంక్షేమమే ధ్యేయం
కొడకండ్ల: ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పల్లెల అభివృద్ధి, నిరుపేదల సంక్షేమమే తన ధ్యేయమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నా రు. బుధవారం మండలంలోని రామన్నగూడెం, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో రూ.కోటికి పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు సురేష్‌నాయక్, రాజేష్‌నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ ఈరంటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే
రైతులకు న్యాయం
పాలకుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు సరైన న్యాయం జరిగిందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం చెన్నూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ధాన్యం విక్రయానికి వచ్చిన రైతులతో మాట్లాడారు. మద్దతు ధర గురించి ఆరా తీసి సమస్యలు తెలుసుకున్నారు. తూకంలో పారదర్శకత ఉండాలని, తడిసిన ధాన్యాన్ని తిరస్కరించే పద్ధతి కాదని నిర్వాహకులకు సూచించారు. కారుపోతుల శ్రీనివాస్, మాదాసు హరిష్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి