
జనగామ డిపో సేవలు భేష్
జనగామ: ఆర్టీసీ జనగామ డిపో సోవలు బాగున్నాయి.. ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నదని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలమన్ అన్నా రు. బుధవారం రీజినల్ మేనేజర్ విజయ భాను, డిప్యూటీ రీజినల్ మేనేజర్ భానుకిరణ్‌తో కలిసి ఆయన స్థానిక డిపోను సందర్శించారు. డీఎం ఎస్.స్వాతి వారికి స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటి నీరు పోసిన తర్వాత ఉద్యోగులు, సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ డిపో పరిధిలో ఉన్న అన్ని విభాగాల సిబ్బంది ఉత్తమ సేవలు అందిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రయాణికుల మన్ననలు పొందడంతోపాటు సంస్థకు మరింత మంచి పేరు తేవాలని సూచించారు. క్రమశిక్షణతో పని చేయడం వల్లే ఉత్తమ ఫలితాలు వచ్చాయని వివరించారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు బహుమతులు అందజేశారు.
ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్