జనగామ: వరుస అగ్ని ప్రమాదాలతో అమాయక ప్రజలు మృత్యువాత పడుతున్నారు.. వందల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గి పాలవుతోంది.. అయినా అధికార యంత్రాంగం మేల్కోవడం లేదు. నిబంధనలను ఉల్లంఘించి సెల్లార్ల నిర్మాణంతో వ్యాపారా లు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే మంటలు ఆర్పే పరిస్థితి కనిపించడం లేదు. ఇరుకై న రోడ్లు.. అందులోనే వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వహణ ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు, బాంక్వెట్ హాళ్లు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, లాడ్జీలు, బార్ అండ్ రెస్టాంట్లు, బ్యాంకులు, విద్యాసంస్థలు, ఫంక్షన్ హాళ్లు సూపర్ మార్కెట్లు, వాహన షోరూంలలో ఫైర్ సేఫ్టీ గాలిలో దీపంలా మారింది. పురపాలిక అనుమతులు జారీ చేసే సమయంలో కళ్లు మూసుకుని పర్మిషన్లు ఇస్తున్నారు.
అడ్డగోలుగా సెల్లార్ల నిర్మాణం
పట్టణంలో సుమారు 1,950 వరకు వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉండగా.. 11వేల పైచిలుకు గృహాలు(మొదటి, రెండవ, మూడవ, పెంటౌస్) ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు అపార్టుమెంట్ల నిర్మాణ సమయంలో పురపాలిక, అగ్నిమాపక తదితర శాఖల అనుమతులు తీసుకో వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీతో పాటు ప్రమాదం జరిగితే ఎగ్జిట్ ఉండేలా చూసుకోవాలి. అయితే.. పట్టణంలో సెల్లార్లకు అనుమతులు లేకున్నా.. పార్కింగ్ కోసమంటూ ‘కొంతమంది’ని మేనేజ్ చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. కొద్ది రోజుల పాటు సెల్లార్ ఖాళీగా ఉంచి.. ఆ తర్వాత వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తున్నారు. ఇందులో ఎలక్ట్రికల్ దుకాణాల గోదాంలు, ప్రైవేట్ ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న లేబొరేటరీలు, బిగ్ జబార్, ఫ్యాన్సీ స్టోర్, ఏజెన్సీలు తదితర షోరూంల నిర్వహణ సాగిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ వ్యాపార సంస్థల్లో పదుల సంఖ్యలో కస్టమర్లు, అందులో పని చేసే కార్మికులు ఉంటారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని చెలరేగితే తప్పించుకునే పరిస్థితి ఉండదు.
వరుస ఘటన..
అయినా మేల్కొని అధికారులు
జనగామ పట్టణంలో గతంలో షాపింగ్‌మాల్, ఎలక్ట్రిల్ షాపులో మంటలు చెలరేగి లక్షలాది రూపాయల ఆస్తి నష్టంతోపాటు తృటిలో ప్రాణాపాయం తప్పిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ బైక్ షోరూంలో రాత్రి సమయంలో మంటలు వ్యాపించగా.. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. సెల్లార్లను వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తున్నారు. వాటిలో ఎలక్ట్రికల్, పేయింట్స్, ప్లాస్టిక్, డోర్‌లు, కరెంటు సామగ్రి, బిగ్ బజార్, కెమికల్, ఆయిల్ తదితర దుకాణాదారులు స్టాక్‌ను భద్ర పరుస్తున్నారు. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరిగితే కనీసం నివారించే పరిస్థితి లేకుండా పోయింది. భారీగా మంటలు చెలరేగిన సమయంలో పక్కనే ఉన్న భవనాలు, నివాస ప్రాంతాలకు వ్యాపిస్తాయి. ఇటీవల పట్టణంలో బాంక్వెట్ హాళ్ల కల్చర్ పెరిగింది. వీటిలో చిన్న చిన్న ఫంక్షన్లు చేయడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకువస్తున్నారు, బాంక్వెట్ హాల్‌లోకి ప్రవేశించిన వారు తిరిగి అదే దారిన లేదా లిఫ్టు నుంచి కిందకు రావాల్సి ఉంటుంది. ఒక్కో ఫంక్షన్‌లో కనీసం 150 మంది నుంచి 250 మంది వరకు ఉంటారు. అనుకోకుండా సంభవించే ప్రమాదాలతో అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం. అక్కడ ఫైర్ సేఫ్టీ కూడా ఉండదు.
ప్రతీ చోట ఫైర్ సేఫ్టీ ఉండాలి
ఫంక్షన్ హాళ్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్, బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, లాడ్జీలు, ఇండస్ట్రియల్, కాటన్ మిల్లులు ఇలా ప్రతీచోట ఫైర్ సేఫ్టీ ఉండాలి. పట్టణంలో చాలా చోట్ల ఫైర్ సేఫ్టీ లేదు. అన్ని వర్గాల వ్యాపార, వాణిజ్య సంస్థలకు గతంలోనే నోటీసులు జారీ చేశాం. అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజన్ వచ్చే వరకు మంటలను అదుపు చేసేందుకు ఫోర్టబుల్ అగ్నిమాపక యంత్రాలు తప్పక అమర్చుకోవాలి. ఇందుకు సంబంధించి 8 అంశాలతో కూడిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించాం.
– రేమండ్‌బాబు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి
2024 ఏప్రిల్ నుంచి 2025 మే వరకు జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాద వివరాలు
ప్రాణాలతో చెలగాటం
నిబంధనలకు నీళ్లు..
అడ్డగోలుగా అనుమతులు..?
ఫైర్ ఇంజన్ వెళ్లలేని ఇరుకై న రోడ్లు..
ఫైర్ స్టేఫీ లేకుండానే అద్దెలకు..
మామూళ్ల మత్తులో అధికారులు
నియోజకవర్గం ప్రమాదాలు నష్టం సేవ్(నగదు)
జనగామ 52 రూ.24.33కోట్లు రూ.42.90కోట్లు
పాలకుర్తి 33 రూ.28.05లక్షలు రూ. 2.07కోట్లు
స్టేషన్‌ఘన్‌పూర్ 16 రూ.8.10లక్షలు రూ.34లక్షలు
‘సెల్లార్’ బిజినెస్
‘సెల్లార్’ బిజినెస్
‘సెల్లార్’ బిజినెస్
‘సెల్లార్’ బిజినెస్
‘సెల్లార్’ బిజినెస్