
రెండు రోజులు.. భారీ వర్షాలు
జనగామ: అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ హెచ్చరించి న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడి న వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైందని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం తెల్లవారు జాము 5 గంటల వరకు 6.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి 7 గంటల వరకు 10 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీవర్షాల నేపథ్యంలో జిల్లాలోని కుంటలు, చెరువుకట్టలపై అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలు చెరువులు, కాలువల వద్ద జాగ్రత్తగా ఉండాలని, వర్షం కురుస్తున్న సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్ల కూడదని కలెక్టర్ సూ చించారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అధి కారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం నుంచి బుధవారం రాత్రి వరకు జిల్లాలో కురిసిన వర్షపాతం (మిల్లీమీటర్లలో)ఇలా..
హెచ్చరించిన వాతావరణ శాఖ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా
మండలం లొకేషన్ వర్షపాతం
బచ్చన్నపేట పడమటికేశ్వాపూర్ 32.8
పాలకుర్తి గూడూరు 34.0
బచ్చన్నపేట బచ్చన్నపేట 22.5
స్టేషన్‌ఘన్‌పూర్ స్టేషన్‌ఘన్‌పూర్ 16.8
పాలకుర్తి వావిలాల 16.0
పాలకుర్తి పాలకుర్తి 20.0
దేవరుప్పుల దేవరుప్పుల 7.8
జఫర్‌గఢ్ జఫర్‌గఢ్ 7.3
కొడకండ్ల కొడకండ్ల 6.5