
ఇద్దరు పిల్లలను ఆర్మీలోకి ..
స్టేషన్‌ఘన్‌పూర్: ఇప్పగూడెం గ్రామానికి చెందిన జిట్టెబోయిన రాజు, శ్రీకాంత్ భారత ఆర్మీలో సేవలు అంది స్తున్నారు. సుభద్ర, వెంకటయ్య దంపతుల కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించి వివాహం చేశారు. కాగా పిల్లలకు తల్లి చిన్నప్పటి నుంచే దేశభక్తిని నూరిపోసింది. దేశ రక్షణకు మించిన సేవ లేదని చెప్పిన మాతృమూర్తి ఆశయం మేరకు కొడుకులిద్దరూ డిగ్రీ వరకు చదివి పదేళ్ల క్రితం భారత ఆర్మీకి సెలక్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. ‘మా పిల్లలు రాజు, శ్రీకాంత్ చిన్నవయస్సు నుంచే భారత సైన్యం అంటే ఇష్టపడేవారు. ప్రస్తుతం పాకిస్తాన్‌తో యుద్ధం ఆందోళనగా ఉంది. మా పిల్లలతోపాటు భారత ఆర్మీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాం.’ అని తల్లి సుభద్ర తెలిపింది.