సర్కారు స్కూళ్లను కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సర్కారు స్కూళ్లను కాపాడుకోవాలి

Apr 6 2025 1:12 AM | Updated on Apr 6 2025 1:12 AM

సర్కారు స్కూళ్లను కాపాడుకోవాలి

సర్కారు స్కూళ్లను కాపాడుకోవాలి

జనగామ రూరల్‌: సర్కారు స్కూళ్లను కాపాడుకో వాలని పబ్లిక్‌ అఫైర్స్‌ ఎడ్యుకేషన్‌ ఓఎస్డీ అడపు శ్రీధర్‌ అన్నారు. యశ్వంతపూర్‌ ప్రభుత్వ ప్రాథమి క, ఉన్నత పాఠశాల ప్రారంభమై 60 ఏళ్లు నిండిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ప్రధానోపాధ్యాయు డు దివాకర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ.. తాను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రభుత్వ పాఠశాలనే కారణమని అన్నారు. లక్ష్యం కోసం నిబద్ధతతో శ్రమించాను కాబట్టే నేడు సీఎం పేషీలో ఓఎస్డీగా ప్రభుత్వంలో కీలకమైన స్థాయిలో ఉన్నాన ని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అంది స్తానని తెలిపారు. ఏంఈఓ బి.శ్రీనివాస్‌ మాట్లాడు తూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడాని కి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంపత్‌ కుమార్‌, రాజీవ్‌ రెడ్డి, లయన్‌ ఎడమ సంజీవరెడ్డి, బి.సుధాకర్‌, గండి ప్రవీణ్‌, మాజీ సర్పంచ్‌ గండి లావణ్య, బొట్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

పబ్లిక్‌ అఫైర్స్‌ ఎడ్యుకేషన్‌ ఓఎస్డీ శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement