
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్
జనగామ: వినియోగదారులు చట్టాలపై అవగాహ న పెంచుకోవాలని కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. బ్యాంకు వివరాలతో పాటు ఓటీపీ నంబర్లు గోప్యంగా ఉంచాలని, ఆన్‌లైన్ షాపింగ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే తప్పుడు ప్రకటనలకు ఆకర్షితులై మోసపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ–కామర్స్, డిజిటల్ బిజినెస్‌లో వినియోగదా రుల రక్షణ, ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్, ఇంటర్నెట్‌లో వస్తువుల కొనుగోలు తదితరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జనగామ పట్టణంలో తాగునీటి సరఫరా, వాటర్ ప్లాంట్ తనిఖీలు చేపట్టి నిబంధనల ప్రకారం ఉండేలా సంబంధిత అధికా రులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం అవసరమైతే ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని అన్నారు. వస్తువులు కొనుగోలు చేసి మోసపోతే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారుల సహాయ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ–1800 425 00333/1967 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాధిక్ అలీ ఫౌండేషన్ బాధ్యులు సాధిక్ అలీ, జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్, డీఏఓ వినోద్‌కుమార్, సీపీఓ ఇస్మాయిల్, సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ, వెల్ఫేర్ అధికారి జయంతి, డీఎం మార్కెటింగ్ నరేందర్‌రెడ్డి, హార్టికల్చర్ అధికారి కేఆర్.లత, డీటీలు దేవా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య