● సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై దృష్టి ● పూర్వపరాల కోసం రంగంలోకి దిగిన ఏసీపీ
గోదావరిఖని: ప్రేమ పేరుతో వేధింపులకు గురైన యువతి తాండ్ర అక్షితరాణి ఆత్మహత్య సంఘట నపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. లాంగ్‌లీవ్‌లో వెళ్లి వచ్చి బాధ్యతలు స్వీకరించిన గోదావరిఖని ఏసీపీ రమేశ్ గురువారం అమ్మాయి బంధువులను తన కార్యాలయానికి పిలిచి కేసులో పూర్వపరాలను తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈకేసులో పాలిటెక్నిక్ కళా శాల లెక్చరల్ జెట్టి నవీన్ పాత్ర, జీడీకే–2వ గని ఓవర్‌మెన్ అనిల్‌కుమార్ ఏమి చేశాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. జనవరిలో జీడీకే–2వ గనిలో 15రోజుల పాటు శిక్షణకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న ఓవర్‌మెన్ రవికుమార్ తనపై అత్యాచారం చేశాడని పేర్కొంటూ ఆర్జీవన్ సింగరేణి అధికారులకు అక్షితరాణి చేసిన ఫిర్యాదుపై ఆర్జీవన్ యాజమాన్యం కమిటీ వేసి పూర్వపరాలు పరిశీలించింది. కమిటి అన్ని విషయాలు పరిశీలించిన తర్వా త జరిగిన అన్యాయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలని లిఖిత పూర్వకంగా సూచించినట్లు యువతికి యాజమాన్యం పేర్కొంటోంది. మళ్లీ ఈఅంశం సెప్టెంబర్‌లో తెరపైకి వచ్చింది. బొమ్మకంటి రవికుమార్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాననే సూసైడ్ లేఖ సెల్‌ఫోన్‌లో ఫొటో లభించడంతో ఆ కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్‌లో ఫొటో కాకుండా అసలు కాపీ ఎక్కడుందని పోలీసులు ఆరా తీస్తున్నారు. లభించిన సాఫ్ట్ కాపీని కూడా ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించి నిజాలు తేల్చే పనిలో పోలీసులున్నారు. సూ సైడ్ నోట్ ఎప్పుడు రాసింది? ఎప్పుడు బయటకు వచ్చింది? అనే విషయాలపై దృష్టిసారించారు.
సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై దృష్టి
బాధిత యువతి ఫిర్యాదు చేసినా సింగరేణి అధికారులు ఎందుకు చర్య తీసుకోలేదని, దీనిపై సింగరేణి అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తమకు పిర్యాదు చేసిన వెంటనే ఈవిషయాన్ని పోలీసుశాఖకు ఎందుకు తెలియజేయలేదనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఆత్మహత్యకు దారి తీసిన సంఘటనలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


