యూఐడీఎఫ్ పనులపై ఆసక్తి చూపని వైనం ఐదుసార్లు టెండర్లు పిలిచినా దాఖలు కాని షెడ్యూళ్లు వసతుల కల్పనలో అధికారులకు తప్పని ఇబ్బందులు
పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం యూఐడీఎఫ్ కింద రూ.18.70కోట్లు మంజూరు చేసింది.
ఈ నిధులతో చేపట్టే వాటిని మొత్తం 11 పనులుగా విభజించిన అధికారులు.. గత జనవరిలో టెండర్లు నిర్వహించారు.
ఇందులో ఎనిమిది పనులకు కాంట్రాక్టర్లు షెడ్యూల్ వేయగా.. మిగతా మూడు పనులకు దాఖలే చేయలేదు.
రూ.6కోట్ల విలువైన ఈ పనులకు ఇప్పటివరకు ఐదుసార్లు టెండర్లు నిర్వహించారు. అయినా కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాలేదు.
యూడీఐఎఫ్ కింద ఇచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం నేషనల్ హౌజింగ్ బ్యాంకు ద్వారా రుణం రూపంలో మున్సిపాలిటీలకు కేటాయిస్తుంది.
వీటిని ఏడేళ్ల లోపు రెండేళ్ల మారటోరియం కాలంతో సహా ఐదు వార్షిక వాయిదాలతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ రుణ మొత్తాన్ని చెల్లించడం అంత సులభం కాదని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లుల చెల్లింపు గడువుపై స్పష్టత లేదు. దీనివల్లనే కాంట్రాక్టర్లు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది.
ఎనిమిది పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయినప్పటికీ.. ఇందులో కేవలం ఒక్క పనిని మాత్రమే ప్రారంభించారు. మిగతావి మొదలుపెట్టడానికి సంబంధిత కాంట్రాక్టర్లు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.
పట్టణంలోని 22, 23, 24వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి యూఐడీఫ్ నిధుల నుంచి రూ.2కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు ఆ పనులకు పలుమార్లు టెండర్లు నిర్వహించారు. అయినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆయా వార్డుల్లో మౌలిక వసతులు చేపట్టడం అధికారులకు ఇబ్బందిగా మారింది. కేవలం ఇవే కాకుండా ఈ నిధులతో చేపట్టే మరికొన్ని పనులపైనా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు.
మరోసారి టెండర్ నిర్వహిస్తాం
మెట్‌పల్లి: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. గతంలో పనులు దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడే పరిస్థితులు ఉండేవి. కానీ.. కొంతకాలంగా పనులంటేనే వెనుకంజ వేస్తున్నారు. చేసిన పనులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరగకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెట్‌పల్లి మున్సిపాలిటీకి కొన్ని నెలల క్రితం పట్టణ మౌళిక సదుపాయాల అభివృద్ధి (యూఐడీఎఫ్) కింద నిధులు మంజూరయ్యాయి. ఇందులో కొన్ని పనులకు అధికారులు ఇప్పటికీ ఐదుసార్లు టెండర్లు నిర్వహించినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడమే దీనికి నిదర్శనం.
11 పనులు..రూ.18.70కోట్లు
బిల్లులపై అనుమానంతోనే..
యూడీఐఎఫ్ నిధులతో చేపట్టే పనుల్లో కొన్నింటికి కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదు. అలాంటి వాటికి మరోసారి టెండర్ నిర్వహిస్తాం. టెండర్ పూర్తయిన వాటిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించారు. మిగతా వాటిని కూడా తొందరలోనే మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటాం.
– నాగేశ్వర్‌రావు, డీఈఈ,
మెట్‌పల్లి


