అదును దాటిపోతుందని పసుపు సాగు చేశాను. కొద్దిరోజులుగా డ్రిప్ ద్వారా తడులు ఇచ్చాను. ఆ నీరు సరిపోవడం లేదని నాలుగైదు రోజులుగా పైపుల ద్వారా పారిస్తున్నాను. వ్యవసాయ బావిలో ఉన్న నీరు ఇప్పుడు సరిపోవడం లేదు. వర్షాల కోసం ఎదురుచూడని రోజంటూ లేదు.
– కొలగాని రాంకిషన్,
వెల్దుర్తి, జగిత్యాల రూరల్(మం)
విత్తనాలు తెచ్చిపెట్టుకున్న
మల్లాపూర్: నాకున్న పొలంలో సోయా, మొక్కజొన్న, పసుపు, మిర్చి పంటలు సాగు చేద్దామని భూమినంతా కలియదున్నిచ్చి సిద్ధం చేశాను. విత్తనాలూ కొనుగోలు చేశాను. వర్షాలు పడితే విత్తుకుందామని చూస్తున్న. వాన జాడే లేకుండా పోయింది.
– ఏలేటి మహేష్‌రెడ్డి, రైతు, కొత్తదాంరాజుపల్లి
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఈ ఏడాది రుతుపవనాలు మందగించాయి. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు లోటు వర్షపాతమే ఉంది. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి వంటి పంటలను ఇప్పుడే సాగు చేయవద్దు. కంది, పెసర, చిరు ధాన్యాలు వంటి పంటలు సాగు చేసుకుంటే బాగుంటుంది.
– వడ్డెపల్లి భాస్కర్, డీఏవో


