ఇబ్రహీంపట్నం: తాగుడు మానేయాలని భార్య మందలించినందుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంగిలి పెద్దొళ్ల చిన్న నర్సయ్య(43) మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మధ్యం తాగి వచ్చి భార్య కవితతో గొడవ పడుతున్నాడు. ఇలాగైతే ఎలా అని కవిత మందలించగా.. మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. నర్సయ్యకు ఇద్దరు కూతుళ్లు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


