జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా విద్యుత్‌శాఖ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆర్టిజన్ కార్మికుల సమ్మె శనివారం కూడా కొనసాగింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించినా స్పందించకపోవడంతో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెల్సిందే. రెండున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపజేయాలని, కమిటీ జిల్లా చైర్మన్ సిహెచ్.బాబయ్య, కన్వీనర్ డి.రవీందర్ రెడ్డి, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


