పూలే విగ్రహానికి నివాళి అర్పిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
మాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాలటౌన్: మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయాలను కొనసాగించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పూలే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. కళాజాత బృందం ఆలపించిన గీతాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంక్షేమ పథకాలతో పేదలు, దళితులు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి చేశారని కొనియాడారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం పూలే సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, బీసీ అభివృద్ధి అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో..
పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మాజీమంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పూలే విగ్రహానికి బీఆర్‌ఎస్ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, తుల ఉమ, లోక బాపురెడ్డి, ముసిపట్ల లక్ష్మీనారాయణ, మానాల కిషన్ తదితరులు పాల్గొన్నారు.


