పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం | - | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

జగిత్యాలటౌన్‌: పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంఘనభట్ల దినేశ్‌ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, బండ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతికి పూలే కృషి

ధర్మపురి: అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానీయుడు పూలే అని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూలే జయంతిని నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ చిలుముల లావణ్య, కౌన్సిలర్లు తదితరులున్నారు.

హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలి

మల్లాపూర్‌: హిందూ ధర్మపరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని భద్రాచలం పీఠం వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు విశ్వాత్మనందగిరి స్వామి అన్నారు. మండలంలోని కొత్తదాంరాజుపల్లిలో శనివారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సహా కార్యావహ్‌ గుండు సాయిమధుకర్‌తో కలిసి గోపూజతోపాటు జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనం ప్రారంభించారు. ప్రపంచంలో అత్యంత గొప్ప నాగరికత దేశానిదన్నారు. సనాతన హిందూ ధర్మం గొప్పదనం ప్రపంచానికే తెలిసిందన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఎగ్యారపు లింబాద్రి, ఉపసర్పంచ్‌ బద్దం హరీష్‌రెడ్డి, వార్డుసభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement