దళారులకు విక్రయించొద్దు | - | Sakshi
Sakshi News home page

దళారులకు విక్రయించొద్దు

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

కోరుట్లరూరల్‌/మెట్‌పల్లి/ధర్మపురి/కరీంనగర్‌: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమర్‌ అన్నారు. శుక్రవారం కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోని వ్యవసాయ మార్కెట్‌యార్డు, ధర్మపురి, గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్‌లలో కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు మక్కలను దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. దళారులు క్వింటాల్‌కు రూ.1,600 మాత్రమే చెల్లిస్తున్నారని, ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించి క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర పొందాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని, ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కు నాలుగు కిలోల కోత విధించారని అన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి కోత లేకుండా రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, కోరుట్ల సెగ్మెంట్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, ఏఎంసీ చైర్మన్లు పన్నాల అంజిరెడ్డి, చిలుముల లావణ్య, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎస్‌.దినేశ్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం ఎండీ అబీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement