జగిత్యాల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేసేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈనెల 13 నుంచి 18 వరకు ‘సురక్షితంగా.. సజీవంగా గమ్యం చేరాలి’ అనే నినాదంతో రోడ్డు భద్రత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతు, బస్టాండ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేయాలన్నారు. కొండగట్టు పరిధిలో బీటీరోడ్డు కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ, మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వాహన తనిఖీలు నిర్వహిస్తూ అవసరమైన కేసులు ఆర్టీవోకు పంపిస్తూ లైసెన్స్‌లు రద్దు చేసేలా చూస్తున్నామన్నారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లాలో పంచాయతీరాజ్, ఉపాధి పథకాల కింద కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవా రం ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, కిచెన్ షెడ్లు, పాఠశాలల మ రుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నా రు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల ని, అధికారులు తరచూ తనిఖీలు చేస్తూ పర్యవేక్షించాలన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్ర గతి కార్యాచరణలో భాగంగా ప్రజలకు ఉపయోగపడేలా స్థాని క అవసరాలకు అనుగుణంగా పనులు ప్రణాళికాబద్ధంగా జరగాలన్నారు. అదనపు కలెక్టర్లు లత, రా జాగౌడ్, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.


