కేసీఆర్‌ను కలిసిన జీవన్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కలిసిన జీవన్‌రెడ్డి

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

● విద్యాసాగర్‌రావు, వసంతతో కలిసి ఎర్రవెల్లికి.. ● బీఆర్‌ఎస్‌లో ఫుల్‌ జోష్‌

జగిత్యాల: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు జగిత్యాల నుంచి విద్యాసాగర్‌రావు, దావ వసంతతో కలిసి ఎర్రవెల్లికి వెళ్లారు. అనంతరం కేసీఆర్‌ను కలిశారు.

బీఆర్‌ఎస్‌లో జోష్‌

గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించినా అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆ పార్టీ వైపు వెళ్లారు. దీంతో సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర విభేదాలు రావడం, కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఎమ్మెల్యేకు పెద్దపీట వేయడంతో 20 నెలలుగా వివిధ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో పార్టీ వీడాలని జీవన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ పెద్దలు వచ్చి నచ్చజెప్పినా వినలేదు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపినట్లయింది.

సందిగ్ధంలో నేతలు

జగిత్యాల బీఆర్‌ఎస్‌లో ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పార్టీలోంచి వెళ్లిపోవడంతో ఎమ్మెల్సీ రమణ, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. జీవన్‌రెడ్డి రాకతో నేతల భవిష్యత్‌ ఎలా ఉంటుందోనని జిల్లాలో చర్చలు జరుగుతున్నాయి.

20న సభ?

జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈనెల 20లోపే సభ ఏర్పాటు చేసి జీవన్‌రెడ్డిని కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement