మన సంస్కృతి, కుటుంబ విలువలను కాపాడుకోవాలని అధ్యాపకురాలు జోత్స్న అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హిందూ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మాట్లాడారు. మహిళలు సంఘటితంగా ఉంటూ కుటుంబాలను హిందు విలువల ఆధారంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. విద్యానగర్ రామాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ధరూర్ క్యాంపులోని కోదండ రామాలయం వరకు సాగింది. హిందూ మహిళా వేదిక, సేవికాసమితి బాధ్యులు కనోష్ణ, స్వప్న, స్రవంతి, సునీత, అశ్విని, భారతి, దీప, మధురిమ, సుజాత, కౌన్సిలర్లు లక్ష్మి, ప్రశాంతరావు పాల్గొన్నారు. – జగిత్యాలటౌన్


