రాయికల్(జగిత్యాల): సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులే తన జవాబుదారితనమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని ఉప్పుమడుగులో రూ.4 కోట్లతో చేపడుతున్న కేజీబీవీ పాఠశాల నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. రామాజీపేట, జగన్నాథపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని, తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు అభివృద్ధితోనే జవాబుదారిగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరితో కలిసి పనిచేస్తానని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. జగన్నాథపూర్, బోర్నపల్లి గ్రామాల వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి వద్దకు వెళ్లానని గుర్తుచేశారు. అలాగే బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నిధులు మంజూరు చేశారన్నారు. సర్పంచులు రోజా, బెజ్జంకి మోహన్, పరంచ శంకర్, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, ఎస్సై సుధీర్‌రావు, నాయకులు కోల శ్రీని వాస్, ఏనుగు మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.


