జగిత్యాల: సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యమని, జీవనశైలిలో ఒక భాగంగా అలవర్చుకోవాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ హోమియోపతి, ఆయుష్ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం యోగా భవన్‌లో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజూ ఉదయం యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ఆయుష్ వైద్య విధానాలు ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. హోమియోపతి వంటి సంప్రదాయ పద్ధతులు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు, జీవనశైలిని మెరుగుపరుస్తాయన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేయడంతో పాటు, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


