‘ఇందిరమ్మ ఇళ్లు’ త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ ఇళ్లు’ త్వరగా పూర్తి చేయాలి

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

కరీంనగర్‌: వెల్గటూర్‌ మండలంలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ గురువారం పర్యటించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో జనగణన పనులను పరిశీలించారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. మండలకేంద్రంతోపాటు, స్తంభంపల్లిలో నర్సరీల్లోని మొక్కలను పరిశీలించారు. పూలు, పండ్లు, ఇతర నీడనిచ్చే మొక్కలు పెంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్‌ చేయాలని అన్నారు. డీఆర్డీవో పీడీ రఘువరన్‌, హౌసింగ్‌ పీడీ ప్రసాద్‌, తహసీల్దార్‌ శేఖర్‌, ఎంపీడీవో నరేశ్‌కుమార్‌, ఎంపీవో కృపాకర్‌, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పీఎన్జీ ఉత్తమ ప్రయత్నం

జగిత్యాల: ఎల్పీజీ సరఫరాపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి స్వదేశీ వనరుల ద్వారా లభించే పీఎన్జీ ఉత్తమ ప్రయత్నమని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారు. వాణిజ్య అవసరాల్లో పీఎన్జీ వినియోగం అత్యవసరమన్నారు. మొదటి దశ రామగుండం నుంచి కరీంనగర్‌ వరకు పైప్‌లైన్‌ పనులు జరుగుతున్నాయని, మార్చి 2027 నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement