కోరుట్లరూరల్: మండలంలోని జోగిన్‌పెల్లిలో రూ. 20లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ గురువారం ప్రారంభించారు. రూ.20లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న రెండు మహిళా సంఘ భవనాలకు ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. పీహెచ్‌సీ భవనానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తానన్నారు. శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కల్యాణ మండపానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్ అంబేద్కర్, ఐకేపీ ఏపీఎం సమ త, అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
పసుపు బోర్డుపై సంజయ్ మాట్లాడడమా..?
కోరుట్ల: పసుపు బోర్డుపై ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడకుంటే మేలు అని ఎంపీ అన్నారు. పట్టణంలో వి లేకరులతో మాట్లాడారు. ఐదేళ్లు రీసెర్చ్ చేసి బోర్డు తెచ్చామని, బోర్డు గురించి సంజయ్‌కి ఏం తె లుసని, అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ మునిగిపోయే నావ అని, ఎవరు వెళ్లినా ప్రయోజనం ఉండదన్నారు.


