గ్రామాల్లో నీటి ఎద్దడి రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో నీటి ఎద్దడి రానీయొద్దు

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌

పెగడపల్లి: వేసవిలో తాగునీటి ఎద్దడి రానీయొద్దని అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ముందుగా వెంగళాయిపేటలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శశికుమార్‌రెడ్డితో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో సమావేశమయ్యారు. గ్రామాల వారీగా మంచినీటి పథకాలు, చేతిపంపులు, పైప్‌లైన్‌ నిర్వహణ, పనితీరు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ పథకాన్ని జాబ్‌ కార్డున్న ప్రతి కూలీ వినియోగించుకోవాలన్నారు. వెంగళాయిపేట సర్పంచ్‌ గోపాల్‌, హౌసింగ్‌ ఏఈ జ్యోతి, ఏపీవో పాల్గొన్నారు.

తక్కువ ఫీజు తీసుకోవాలి

జగిత్యాల: ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు తక్కువ ఫీజు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ అన్నారు. క్లీనికల్‌ ఎస్టాబ్లీష్‌మెంట్‌ యాక్ట్‌పై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఫీజుల వివరాలను బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలు మానవత దృక్పథంతో తక్కువ డబ్బుతో చికిత్స అందించాలన్నారు. మాతాశిశు సంక్షేమాధికారి జైపాల్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్‌ పాల్గొన్నారు.

ఘనంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం

మల్లాపూర్‌: మండలంలోని గొర్రెపల్లి శివారుశ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామివారి కల్యాణాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్‌ ఏలేటి వెంకట్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశా రు. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, కిసాన్‌కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల రాజ న్న, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పూండ్ర శ్రీని వాస్‌రెడ్డి దర్శించుకున్నారు.

మక్కలు ఎక్కువ తూకం వేస్తున్నారని ఫిర్యాదు

ఇబ్రహీంపట్నం: మక్కల్లో చెత్తాచెదారం లేకుండా యంత్రాల ద్వారా శుభ్రం చేసినప్పటికీ క్వింటాల్‌కు 300 గ్రాములు ఎక్కువ తూకం వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలకేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని కమిటీ వైస్‌ చైర్మన్‌ ఏలాల వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గూడ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు పిట్టల వంశీ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే మక్కల కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని, శుభ్రం చేసినా ఎక్కువ తూకం వేయడం ద్వారా నష్టపోతున్నామని వారి దృష్టికి తీసుకొచ్చారు. మార్క్‌ఫెడ్‌ అధికారులతో మాట్లాడతామని, కేంద్రాల వద్ద రాజకీయాలు వద్దని వెంకట్‌రెడ్డి రైతులకు సూచించారు.

పౌరసరఫరాల శాఖలో నకిలీ డిపాజిట్లు..?

జగిత్యాలక్రైం: కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించేందుకు అధికారులు బ్యాంక్‌ గ్యారంటీ తీసుకుంటున్న విషయం తెల్సిందే. అయితే గత వానాకాలం ధాన్యానికి సంబంధించి జిల్లాకు చెందిన ఇద్దరుముగ్గురు మిల్లర్లు ఓ ప్రైవేటు బ్యాంక్‌ నుంచి నకిలీ డిపాజిట్‌ పేపర్లు తీసుకొచ్చి అధికారులకు అప్పగించినట్లు సమాచారం. ఇటీవల అధికారులు విచారణ చేపడుతున్న సమయంలో రెండు నకిలీ డిపాజిట్‌ పత్రాలను గుర్తించినట్లు తెల్సింది. ఇందులో ఓ మిల్లర్‌ సదరు అధికారులను బుజ్జగించి నకిలీ డిపాజిట్‌ పత్రాన్ని తీసుకెళ్లాడన్న విష యం ప్రైవేట్‌ బ్యాంక్‌ నిర్వాహకుడికి తెలిసింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకునేందుకు ఆ బ్యాంక్‌ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని మిగిలిన మిల్లర్లు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement