జగిత్యాల: ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. ప్రజాపాలన ప్రగ తి ప్రణాళికలో భాగంగా ఎయిడ్స్ వ్యాధిపై గురువా రం అవగాహన కల్పించారు. ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు, ఎలా వస్తుందో ప్రజలు తెలుసుకోవాలన్నా రు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సునిల్‌కుమార్, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘అరైవ్ ఎలైవ్’ పకడ్బందీగా అమలు చేయాలి
జగిత్యాల: అరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. కలెక్టర్, ఎస్పీతో గురువారం కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈనెల 13 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సభలు నిర్వహించి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై వివరించాలన్నారు. విద్యార్థులతో ర్యాలీలు, మండలస్థాయి కార్యక్రమాలు, వాహన చోదకులకు కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు.
మెట్‌పల్లిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపండి
మెట్‌పల్లి: పట్టణం మీదుగా వెళ్తున్న నాందేడ్–ధర్మవరం, నాందేడ్–తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మెట్‌పల్లిలో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ అర్వింద్‌కు గురువారం వినతిపత్రం అందించారు. రైళ్లను ఆపడం ద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉంటుంద న్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు తోకల సత్యనారాయణ, నాంపల్లి గట్టయ్య, అంబాల జగన్, సుంకె అశోక్, రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పీహెచ్‌సీల్లో ఏర్పాట్లు
ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో పోలీసు, వైద్య, కార్మిక, అగ్నిమాపక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్, మున్సిపల్, రవాణా, ఇరిగేషన్ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. హీట్‌వేవ్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వడదెబ్బ బారిన పడితే ప్రాణానికి ముప్పు ఉంటుంది. సకాలంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తీవ్రమైన వడదెబ్బ తాకితే గుండె, మెదడుపై ప్రభావం పడుతుంది.
వడదెబ్బ లక్షణాలు
శరీరంలో నీటి శాతం లోపిస్తుంది. నీరసంగా ఉంటూ కాళ్లు లాగుతూ తలనొప్పి వస్తుంది. జ్వరం, విరోచనలు, వాంతులు, తల తిరగడం, గుండె లయ తప్పుతుంది. మెదడు కూడా సమతుల్యత తప్పుతుంది. ఈ పరిస్థితిని తట్టుకోకపోతే మరణించే అవకాశాలుంటాయి. వడదెబ్బకు గురైన వ్యక్తిని శరీరాన్ని వేగంగా చల్లబర్చే ప్రయత్నం చేయాలి. చల్లని ప్రదేశానికి తీసుకెళ్లి చల్లని నీరు చల్లడం, ఫ్యాన్‌గాలి ధారాలంగా వచ్చేలా చూడాలి. తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. రోగి చుట్టూ గుమికూడదు. విశ్రాంతి ఎక్కువగా తీసుకోనివ్వాలి. వడదెబ్బ తగిలిన తర్వాత మళ్లీ ఎండలోకి వెళ్లకూడదు.


