స.హ చట్టం సాధన జిల్లా కమిటీ | - | Sakshi
Sakshi News home page

స.హ చట్టం సాధన జిల్లా కమిటీ

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

కోరుట్ల: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడిగా వొడ్నాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో గురువారం కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా గట్ల ప్రకాశ్‌, కన్వీనర్‌గా బద్రి సుజన్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా దీకొండ చిప్ప నీరంజన్‌, కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా ఆనంద్‌ రాజు, ప్రధాన కార్యదర్శిగా బాలె అజయ్‌, మండల అధ్యక్షుడిగా జుగ్గి వినయ్‌కుమార్‌, జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షుడిగా కంది చంద్రశేఖర్‌ రావు, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్‌ జహంగీర్‌, మండల అధ్యక్షురాలిగా కోటగిరి రాజేశ్వరి, ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షుడిగా బుర్ర నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా కురికల హనుమాన్‌ శేఖర్‌ను నియమించారు. నూతన కార్యవర్గానికి నియామక పత్రాలు, ఐడీ కార్డులు అందించారు.

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం

కోరుట్ల: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. పట్టణంలో గురువారం విద్యుత్‌ బాట నిర్వహించారు. ట్రాన్స్‌ఫార్మర్లకు అమర్చిన స్మార్ట్‌మీటర్లను తనిఖీ చేశారు. పట్టణంలో 160 కేవీఏ, ఆపై సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్‌ మీటర్లు అమర్చుతామన్నారు. కార్యక్రమంలో మెట్‌పల్లి డీఈ మదుసూదన్‌, జగిత్యాల డీఈ టెక్నికల్‌ గంగారాం, కోరుట్ల డీఈ భూమేశ్వర్‌, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement