కోరుట్ల: ప్రాణం ఉన్నంత వరకు బీజేపీతోనే ఉంటా నని, కోరుట్ల నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్‌కుమార్ అన్నారు. ఆయన రెండోసారి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై న సందర్భంగా బుధవారం మెట్‌పల్లి నుంచి కోరుట్ల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కోరుట్ల బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మొదటి నుంచి క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా కొనసాగిన తన సేవలను అధిష్టానం గుర్తించి మరోసారి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీలో సుమారు వేయి మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
సురభి కార్యక్రమంలో పాల్గొనవద్దు
మెట్‌పల్లి: నవీన్‌రావుకు స్వాగతం పలికేందుకు పలువురు దూరం ఉండడం చర్చనీయాంశమైంది. రెండోసారి ఎన్నికై న ఆయనకు స్వాగతం చెబుతూ పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నవీన్‌రావు, పార్లమెంట్ పరిధిలోని ఓ ముఖ్య నేతకు మధ్య చాలాకాలంగా కోల్డ్‌వార్ నడుస్తోంది. ప్రస్తుతం ఆ నేతకు సంబంధం లేకుండానే మరోసారి నవీన్ రావు పదవి తెచ్చుకున్నట్లు సమాచారం. ఆగ్రహించిన ఆ నేత.. నవీన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు దూరంగా ఉండేలా చూడాలని నియోజకవర్గ నా యకులకు సూచించినట్లు సమాచారం. దీంతో వా రు పట్టణంతోపాటు మండలాలకు చెందిన ప్రధాన నాయకులకు ఫోన్లు చేసి నవీన్ కార్యక్రమంలో పాల్గొనవద్దని చెప్పినట్లు తెలిసింది. వారి చేశారు. న పలువురు దూరంగా ఉండడంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు సురభి చేపట్టిన ర్యాలీ విజయవంతం కావడం గమనార్హం.


