కథలాపూర్: మండలంలోని కలిగోట శివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. బుధవారం ప్రాజెక్టు పనులను పరిశీలించి కాంట్రాక్టర్, నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షించారు. వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయించాలన్నారు. పనులు పూర్తయితే 43వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రతి 11 రోజులకోసారి సమీక్షిస్తామన్నారు. ఎస్‌ఈ రమేశ్, ఈఈ సంత్ ప్రకాశ్‌రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు కల్లెడ గంగాధర్, అంబటి రాధాకృష్ణ, పాల నవీన్, జవ్వాజి రవి, గాజ ప్రభాకర్, భైర మల్లేశం, బాలు తదితరులు పాల్గొన్నారు.


