జిల్లాలోని అన్ని మార్కెట్‌లలో సరైన వసతులు కల్పించాలి. రైతులకు విశ్రాంతి భవనాలు నిర్మించాలి. తాగునీటి సదుపాయాలు, మూత్రశాలలూ సరిగా లేవు. రైతుల ఉత్పత్తుల అమ్మకం ద్వారా మార్కెట్‌లకు వచ్చే ఆదాయాన్ని మార్కెట్‌లు, రైతుల అభివృద్ధికే ఖర్చు చేయాలి. – నక్కల తిరుపతి రెడ్డి,
జిల్లా రైతు సంఘం నాయకుడు
ఆదాయం భారీగా సాధించాం
అన్ని మార్కెట్లలో లక్ష్యాన్ని మించి 125.34 శాతం సాధించాం. 2025–26కు గాను రూ.26.60 కోట్లు అందుకున్నాం. మార్కెట్ ఫీజును కచ్చితంగా వసూలు చేయడంతోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాం. ఆయా మార్కెట్లలోని మార్కెట్ సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.
– ప్రకాశ్, జిల్లా మార్కెటింగ్ అధికారి


