సర్పంచ్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

కొడిమ్యాల: మండలంలోని తిప్పాయపల్లె సర్పంచ్‌ రాజేశంపై గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా చెట్లను నరికి వచ్చిన సొమ్మును సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తెలిపారు. చెట్లను నరికి విక్రయించి వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు గౌతమ్‌ రెడ్డి, మ్యాకల మల్లేశం, అరుణ్‌, వెంకట్‌ రెడ్డి, వెంకటేశం కోరారు.

ప్రజావాణిలో రీల్స్‌ చూసిన ఏఎస్సై

జగిత్యాలటౌన్‌: కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారులకు టైంపాస్‌గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సమస్యలతో వచ్చేవారికి సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ స్పష్టంగా ఆదేశిస్తున్నా.. అధికారులు లైట్‌గా తీసుకుంటున్నారు. సోమవారం ప్రజావాణి కొనసాగుతుండగానే ఓ ఏఎస్సై ఫోన్లో రీల్స్‌ చూస్తూ కాలక్షేపం చేయడం కనిపించింది. గతంలోనూ ప్రజావాణిలో అధికారులు పోన్లు చూస్తూ దొరికిపోయినా ఎ లాంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఏం అవుతుందిలే అన్న ధోరణిలో ఉన్నట్లు బాధితులు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement