పీఎఫ్‌ ఉన్న పెన్షన్‌ రావడం లేదు | - | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ ఉన్న పెన్షన్‌ రావడం లేదు

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

మాది కోరుట్ల మండలం చిన్న మెట్‌పల్లి. బీడీలు చుడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. జీవనభృతి రావడం లేదు. బీడీలు చేయని వారు జీవనభృతి పొందుతున్నారు. పీఎఫ్‌ ఉండి.. నిత్యం బీడీలు చుడుతున్న మాకు మాత్రం రావడం లేదు. సమస్యను పరిష్కరించండి.

– బీడీ కార్మికులు, చిన్నమెట్‌పల్లి

వీవోఏను నియమించండి

నేను గ్రామంలో 34సంఘాలకు పనిచేసిన. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మీటింగ్‌కు వెళ్లాననే ఆరోపణలపై విధులకు దూరంగా ఉంచారు. విధుల్లో చేర్చుకునేందుకు ఎంపీడీవో ఆదేశాల మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఓటింగ్‌ నిర్వహించారు. నాకు 300, ప్రత్యర్థికి నాలుగు ఓట్లు వచ్చాయి. విధుల్లో చేరేందుకు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. డీఆర్‌డీఏ మండల సమాఖ్య అధ్యక్షురాలికి లేఖ రాశారు. అయినా అధికారులు జాప్యం చేస్తున్నారు. విచారణ చేపట్టి విధుల్లో చేర్చుకునేలా చూడండి.

– ఇనుగుర్తి సరిత, రేగుంట, మల్లాపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement