జగిత్యాలటౌన్: హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈనెల 28న కరీంనగర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను జయప్రదం చేయాలని రైతు ప్రజాసంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కోరారు. ఎమ్మెల్యే సంజయ్, మాజీమంత్రి జీవన్‌రెడ్డిని వేర్వేరుగా కలిసి మహాగర్జన సభకు రావాలని ఆహ్వానించారు. వారితో కలిసి మహాగర్జన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 2లక్షల మందితో కరీంనగర్‌లో నిర్వహించే మహాగర్జనకు పార్టీలకతీతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. రైతు ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు కొండాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్వర్‌రావు, సర్పంచులు పాల్గొన్నారు.


