రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
● బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
జగిత్యాల: రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను జయప్రదం చేయాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ ధరించకపోవడం ద్వారా ఏటా చాలా మంది మరణిస్తున్నారని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్టీసీ, ఎడ్యుకేషన్, పోలీస్, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్లలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 900 గ్రాముల వెండి విగ్రహాలు.. ● 10 గ్రాముల బంగారం అపహరణ
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని కృష్ణానగర్‌లో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. కృష్ణానగర్‌కు చెందిన పబ్బ సాగర్ బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇటీవల తన తల్లిని కూడా బెంగళూరు తీసుకెళ్లాడు. శనివారం ఉదయం పని మనిషి వెళ్లేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో స్థానికులు సాగర్‌కు సమాచారం అందించారు. ఆయన సమాచారం మేరకు పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. ఇద్దరు దొంగలు తాళాలు పగులగొట్టి 900 గ్రాముల వెండి విగ్రహాలు, 10 గ్రాముల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దొంగలిద్దరూ గ్లౌస్‌లు, మంకీక్యాప్‌లు ధరించినట్లు ఇంట్లో ఉన్న సీసీ పుటేజీల్లో రికార్డు అయ్యింది. సాగర్ బెంగళూరు నుంచి వచ్చాక ఇంట్లోని సామగ్రిని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి


