దొంగమల్లన్న ఆదాయం రూ.23లక్షలు
గొల్లపల్లి: గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలోగల దొంగ మల్లన్న స్వామి ఆలయానికి ఈయేడు ఆదాయం భారీగా పెరిగింది. షష్టి వారాల జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను శనివారం అధికారులు లెక్కించారు. హుండీల ద్వారా రూ.23,08,733తో పాటు 7.500గ్రాముల మిశ్రమ బంగారం, 550 గ్రాముల మిశ్రమ వెండి, సేవా టికెట్లు, వివిధ రకాల పూజా కార్యక్రమాల ద్వారా రూ.7,08,720 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎస్సై ఎం.కృష్ణసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. హుండీ లెక్కింపులో జగిత్యాల డివిజన్ పరిశీలకులు రాజమొగిలి, ఫౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య, ఆలయ ఈవో ముద్దం విక్రమ్, పూజారి రాజేందర్, నాయకులు ముత్యాల స్వామి, లంబ లస్మయ్య, మద్దెల జగన్, దేవాదాయ శాఖ సిబ్బంది శివ కేశవ్, రవీందర్, శ్రీ లలితా సేవా ట్రస్ట్ సభ్యులు, లక్ష్మీపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.


