క్రైస్తవుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

క్రైస్తవుల సంక్షేమానికి కృషి

Dec 21 2025 9:29 AM | Updated on Dec 21 2025 9:29 AM

క్రైస

క్రైస్తవుల సంక్షేమానికి కృషి

● మంత్రి అడ్లూరి ● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ వసంత

● మంత్రి అడ్లూరి

ధర్మపురి: క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. స్థానిక ఎస్‌హెచ్‌ గార్డెన్‌లో శనివారం ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో అడిషనల్‌ కలెక్టర్‌ లత, జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ముందుగా కేక్‌కట్‌ చేసి శభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందన్నారు. క్రిస్మస్‌ అంటే శాంతి, ప్రేమ, దయ, కరుణకు ప్రతీక అన్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌ చిలుముల లావణ్య, క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు తదితరులున్నారు.

కొండగట్టుపై వీహెచ్‌పీ ధర్నా

మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయ భూములు కాపాడాలని డిమాండ్‌ చేస్తూ విశ్వ హిందూ పరిషత్‌ నాయకులు ఆలయం ఎదుట దీక్ష చేపట్టారు. అటవీశాఖ చేపట్టిన హద్దుల వివాదం పరిష్కరించి, ఆలయ పరిధిలోని భూములన్ని ఆలయానికే చెందేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు రాధాకృష్ణ, మామిడాల రాములు, గాజోజు సంతోష్‌ కుమార్‌, యాగండ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పుట్టగొడుగుల పెంపకంపై సదస్సు

జగిత్యాలఅగ్రికల్చర్‌: పుట్టగొడుగుల పెంపకంపై జగిత్యాల రూరల్‌ మండలం పొలాస వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో తక్కళ్లపల్లిలో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్‌ ఎల్లాగౌడ్‌ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయంతోపాటు పుట్టగొడుగులు పెంచి ఆదాయం సంపాదించాలన్నారు. పుట్టగొడుగుల పెంపకంతో రైతులకు ఆదాయం వస్తుందన్నారు. ప్రొఫెసర్లు వేణుగోపాల్‌, తిరుపతి, రాజేంద్రప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

జగిత్యాల బల్దియాలో ఫీల్డ్‌ సర్వే

జగిత్యాల: జగిత్యాల మున్సిపల్‌ పరిధిలో ఫీల్డ్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ అన్నారు. సర్వే కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. నేషనల్‌ జియో స్పెషియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హబిటేషన్‌ (నక్ష)లో భాగంగా సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ గ్రామీ ణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం అమలవుతుందని, అర్బన్‌ ఆస్తులకు సంబంధించిన నక్ష రూపొందిస్తామని తెలిపారు. గతంలో హెలి కాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించామ ని, మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఇంటి నంబర్లు, ఇంటి యజమానుల రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సమాచార సేకరణకు ఈ సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన పాల్గొన్నారు.

పార్టీ మారలేదంటూ ఎమ్మెల్యే బుకాయింపు

జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారలేదంటూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్‌ అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జీవన్‌రెడ్డి అధికారంలో లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డారని గుర్తు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌ జగిత్యాలకు వచ్చి మెడికల్‌ కళాశాలపై మాట్లాడితే ఇక్కడి ఎమ్మెల్యే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు గెలిపిస్తే పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. శీలం ప్రవీణ్‌, వొల్లం మల్లేశం, ఆనందరావు, గంగాధర్‌ పాల్గొన్నారు.

క్రైస్తవుల సంక్షేమానికి కృషి1
1/3

క్రైస్తవుల సంక్షేమానికి కృషి

క్రైస్తవుల సంక్షేమానికి కృషి2
2/3

క్రైస్తవుల సంక్షేమానికి కృషి

క్రైస్తవుల సంక్షేమానికి కృషి3
3/3

క్రైస్తవుల సంక్షేమానికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement